మొదలైన ‘జీనియస్’ డబ్బింగ్

మొదలైన ‘జీనియస్’ డబ్బింగ్

Published on Aug 22, 2012 8:45 PM IST


టీవీ యాంకర్ గా బుల్లి తెరకు పరిచయమై, డాన్స్ ప్రోగ్రాం ల ద్వారా పేరు తెచ్చుకున్న ఓంకార్ దర్శకుడిగా మారి దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘జీనియస్’. ఈ చిత్రానికి సంభందించిన డబ్బింగ్ కార్యక్రమాలు ఈ రోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి. రవిబాబు దర్శకత్వం వహించిన ‘నువ్విలా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హవిష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపిస్తున్న హవీష్ మాట్లాడుతూ ఎంతో చాలెంజ్ తో కూడుకున్న పాత్ర చేసాను దీనికోసం ఎంతో కష్ట పడ్డాను అని అన్నారు. ఈ చిత్రంలో సనుష మరియు అభినయ కథానాయికలుగా నటిస్తున్నారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్నికృష్ణ కథ అందించారు.

తాజా వార్తలు