మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఓలె ఓలె’ అంటూ సాగే ఈ పక్కా మాస్ ఫోక్ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో అద్భుతంగా కంపోజ్ చేసి పాడాడు. ఆయన పాటకు రవితేజ, శ్రీలీల ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్స్‌తో ఇరగదీశారు.
మొత్తానికి మరోసారి భీమ్స్ ఈ పాటతో తనదైన మార్క్ వేసుకున్నాడు. ఇక ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్ట్రాంగ్ రెస్పాన్స్ లభిస్తుందా అని చిత్ర యూనిట్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి