సెప్టెంబర్ చివరి వారంలో ఒక్కడినే ఆడియో?


నారా రోహిత్, నిత్య మీనన్ జంటగా నటిస్తూ తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఒక్కడినే’. శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ప్రముఖ నేపధ్య గాయకుడూ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా చిత్ర ఆడియోని సెప్టెంబర్ చివరి వారంలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నాగేంద్ర బాబు, సాయి కుమార్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత సి.వి రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాని కేవలం యూత్ ని మాత్రమే ఆకర్షించడానికి రూపొందించకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చూడతగ్గ చిత్రంగా తెరకేక్కించాము. తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ ఫీల్ గుడ్ మూవీలా ఉంటుంది. అలా మొదలైంది, ఇష్క్ సినిమాల్లాగే నిత్య మీనన్ ఈ సినిమాతో హట్రిక్ హిట్ కొడుతుందేమో.

Exit mobile version