ఒక్కడినే మళ్లీ వాయిదా పడిందా?


నారా రోహిత్, నిత్య మీనన్ జంటగా నటించిన ఒక్కడినే డిసెంబర్ 14న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. మొదట డిసెంబర్ 7న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆ తరువాత 14న విడుదల చేస్తామన్నారు. పలు సమస్యల వల్ల విడుదల తేదీ డిసెంబర్ 21కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదే రోజు నాని, సమంతల ఎటో వెళ్ళిపోయింది మనసు, యమహో యమః సినిమాలు విడుదల కాబోతున్నాయి. నాగ బాబు, సాయి కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ సినిమాకి కార్తీక్ సంగీత దర్శకుడు. గతంలో కథ సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రాగ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.

Exit mobile version