పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో పవన్ కళ్యాణ్ కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు వేయనున్నారు. దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయ్యాయి. ఆన్‌లైన్ బుకింగ్స్ ఇలా ఓపెన్ అయ్యాయో లేవో అప్పుడే టికెట్స్ అన్ని కూడా అమ్ముడవుతున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్‌ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ రికార్డులను పాతర వేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.