పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ టాక్‌తో దూసుకుపోతుంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ సందడి చేస్తోంది. ఇక పవన్ యాక్షన్‌తో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 5.4 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతుంది. ‘కాంతార చాప్టర్ 1’ మూవీ రిలీజ్ అయినా కూడా ఓజీ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేశారు.