ఫోటో మూమెంట్ : విక్టరీ వెంకటేష్‌తో శంకర వర ప్రసాద్ గారి విమాన ప్రయాణం

స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిద్దరు కలిసి చెన్నైలో 80s రీయూనియన్ కోసం విమానంలో ప్రయాణించారు.

చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై బయలుదేరే ముందు వారిద్దరు కలిసి ఓ ఫొటోకు పోజిచ్చారు. ఈ స్టార్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఈ ఫోటోతో వారి మధ్య మంచి బాండింగ్ మరోసారి బయటపడింది.

ఇక సినిమాల విషయంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Exit mobile version