ప్రస్తుతం దక్షిణాది నుంచి ఉన్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిల కాంబినేషన్ కూడా ఒకటి. ఆల్రెడీ షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ఇప్పుడు చేశారు. మరి ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.
అనిమల్ కి అందించిన సంగీతంకి గాను ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తాలూకా ఫ్రీక్వెన్సీ ఎలా క్యాచ్ చేస్తాడో చూడాలి. ఇంకో పక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ ప్రాజెక్ట్ కి కూడా ఈ యంగ్ సంగీత దర్శకుడే అనే టాక్ కూడా ఉంది. ఇక ఇంకోపక్క సెన్సేషనల్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఆల్రెడీ తన చేతిలో ఉంది. మొత్తానికి మాత్రం ఈ టాలెంటెడ్ సంగీత దర్శకుడు ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పాలి.