అఫీషియల్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశి ఖన్నా.. లుక్ కూడా అదుర్స్

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫెస్టివల్ ఇప్పుడు మొదలవుతుంది. తన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి వస్తుండగా ఓ పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో శ్రీలీల కాకుండా మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా నటిస్తున్నట్టుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ దీనిని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు.

ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని ఆమెపై లాక్ చేసి విడుదల చేసి కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ చిత్రంలో రాశిఖన్నా శ్లోక అనే పాత్రలో కనిపిస్తుండగా ఒక ఫోటోగ్రాఫర్ గా ఆమె కనిపిస్తుంది. మరి ఈ కొత్త అప్డేట్ తో ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version