అఫీషియల్: రూమర్స్ కి చెక్.. ‘కూలీ’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున, కన్నడ సినిమా నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర అలాగే మళయాళ సినిమా నుంచి సౌబిన్ సాహిర్ లు నటించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొనగా కొన్ని రోజులు కితం ఈ సినిమా ట్రైలర్ రాకుండానే సినిమా ఉంటుంది అన్నట్టు పలు రూమర్స్ కొందరు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు.

కానీ ఇప్పుడు ఈ రూమర్స్ కి చెక్ పెట్టబడింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అఫీషియల్ గా కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ ని చెప్పేసారు. దీనితో కూలీ చిత్రం ట్రైలర్ ఈ ఆగస్ట్ 2న విడుదల చేయడం కన్ఫర్మ్ అయ్యింది. సో ఆ బిగ్ డే కోసం ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ ఆగస్ట్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version