పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా “ఓజి” థియేటర్స్ లోకి రానే వచ్చింది. ఒక బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ తో ప్రీమియర్స్ నుంచే ర్యాంపేజ్ చూపించిన ఓజి ఇప్పుడు ఎట్టకేలకు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కి వచ్చేసింది. మరి ఈ రిలీజ్ తోనే ఫ్యాన్స్ కి క్రేజీ ట్రీట్ ని ప్రామిస్ చేసింది.
ఓజి సినిమా కి ఇది వరకే సీక్వెల్ ఉంటుంది అని కూడా టాక్ వచ్చింది. కానీ తర్వాత అది పెద్దగా వినిపించలేదు. కానీ ఫైనల్ గా బిగ్ స్క్రీన్స్ పై ఓజి కి రెండో భాగం ఉన్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. సో పవన్ కళ్యాణ్ నుంచి మరో క్రేజీ సీక్వెల్ రాబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అలాగే డీవివి దానయ్య నిర్మాణం వహించారు.