‘ది ప్యారడైజ్’ కోసం రాఘవ్ జూయాల్ రెడీ !

The-Paradise

బాలీవుడ్‌ లో యాంకరింగ్‌ తో పాటు నటనలోనూ రాఘవ్ జూయాల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది ప్యారడైజ్ ‘చిత్రంలో కూడా రాఘవ్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా శ్రీకాంత్ ఓదెల తో రాఘవ్ జూయాల్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. రా సీన్స్ ను చూసి రాఘవ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇక రాఘవ్ జూయాల్ త్వరలో ఈ సినిమా సెట్స్‌ లో చేరడానికి రెడీగా ఉన్నాడు.

కాగా, రాఘవ్ జూయాల్, తన పాత్ర గురించి మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో ఈ సినిమా విడుదలవుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version