అక్టోబర్ లో విడుదలకానున్న ‘ఎవడు’?

yevadu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా అక్టోబర్ లో విడుదలకానుందన్న తాజా సమాచారం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని అక్టోబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ‘ఎవడు’ సినిమా అక్టోబర్ లో విడుదలకానుండడంతో చరణ్ నటించిన ‘జంజీర్/తూఫాన్’ సెప్టెంబర్ 6న విడుదల కావచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ను జారీచేయడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం.

Exit mobile version