బరాక్ హుస్సేన్ ఒబామా మరోసారి యు.ఎస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. ఒబామా మరియు రోమ్నీ మధ్య హోరా హోరీగా ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఎన్నికల్లో ఒబామా గెలుపొందారు. ఎంతో ముఖ్య ప్రాంతాలైన ఒహియో మరియు కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో ఒబామా మెజారిటీ సాధించడంతో ఆయనకీ ఈ విజయం వరించింది. ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా రెండవ సారి గెలుపొంది వైట్ హౌస్ కి వెళ్లనున్నారు.
ప్రజాస్వామ్యవాదులు వారి సెనేటర్ పదవులను దక్కించుకోగా, రిపబ్లికన్స్ కూడా వారి పదవులను దక్కించుకున్నారు. అమెరికా ప్రజలు తన మీద ఉంచిన నమ్మకానికి మరియు భరోసాకి ఒబామా వారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎవరు యు.ఎస్ అధ్యక్షుడు అవుతారా అని ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసింది. ఎందుకంటే అమెరికా ఆర్ధిక వ్యవస్థ మరియు మిలిటరీ పై చాలా ప్రదేశాలు ఆధారపడి ఉన్నాయి.