యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ విజువల్స్ తో బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఎన్.టి.ఆర్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాలో అతని కాస్ట్యూమ్స్ కోసం బాగా ఎక్కువగా ఖర్చు చేసారు. ఈ సినిమాలోని ఓ సీన్ లో ఎన్.టి.ఆర్ సూట్ మరియు పైప్ డ్రెస్ లో కనిపిస్తాడు. ఈ సూట్ కోసం ఫాబ్రిక్ ని వాడారు, ఈ ఫాబ్రిక్ కోసం ఒక మీటరుకు లక్ష రూపాయలు చొప్పున ఖర్చు చేసారు. ఈ డ్రెస్ లో ఉండే ఎన్.టి.ఆర్ ఫొటోస్ ఇంకా రిలీజ్ చెయ్యలేదు.
ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాడిన మొత్తం కాస్ట్యూమ్స్ ఖర్చు బాగా ఎక్కువైందని అది సుమారు 3.5 కోట్లు ఉంటుందని అంటున్నారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి గోపి మోహన్ – కోనా వెంకట్ స్క్రిప్ట్ ని అందించారు. ఈ సినిమా ఆడియో మార్చి 10 న ఘనంగా జరగనుంది.