‘బాద్షా’ కోసం సూపర్బ్ ఫైట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్

‘బాద్షా’ కోసం సూపర్బ్ ఫైట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Aug 19, 2012 4:03 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన పనులన్నీ పక్కన పెట్టి తన రాబోతున్న ‘బాద్షా’ చిత్రం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రానికి సంభందించిన యాక్షన్ సన్నివేశాల గురించి మాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ అదిరిపోయే సూపర్బ్ స్టంట్స్ చేస్తున్నారు మరియు ఈ చిత్రానికి ఈ స్టంట్స్ హైలైట్ అవుతాయని భావిస్తున్నారు. ఎన్.టి.ఆర్ కెరీర్లో ఇప్పటికే ఫైట్స్ మరియు డాన్సు చేయడంలో తన సత్తా చాటుకున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ కథా రచయితలు కోనా వెంకట్ మరియు గోపి మోహన్ లు ‘బాద్షా’ చిత్రానికి కథ అందించారు. ప్రస్తుతం ఫుల్ జోరుమీదున్న ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తునారు.

తాజా వార్తలు