వాలెంటైన్స్ డే కానుకగా ఎన్.టి.ఆర్ కొత్త సినిమా

Jr_NTR (4)

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించనున్న కొత్త సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13 సాయంత్రం లాంచనంగా ప్రారంభం కానుంది. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి గతంలో ‘కందిరీగ’ సినిమాని డైరెక్ట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. కామెడీ కలగలిపిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సమంత హీరోయిన్ గా నటించనుంది.

ఈ సినిమా కాకుండా హారీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలో కూడా ఎన్.టి.ఆర్ – సమంత జంటగా నటిస్తున్నారు. ఎన్.టి.ఆర్ 2013లో బిజీ బిజీగా ఉండనున్నాడు. ఎంతకాదన్నా ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ఫ్లాన్ చేస్తున్నారు.

Exit mobile version