యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ చిత్రీకరణ ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ బ్యాంకాక్ షెడ్యూల్ సెప్టెంబర్ 25 వరకు నిర్విరామంగా జరగనుంది. ఈ షెడ్యూల్ తో ఈ చిత్రం 60% చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని అనుకున్న టైం కి పూర్తి చేసి 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఈ చిత్ర టీం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ లలో ఒకరైన శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
‘బాద్షా’ చిత్రంలో ఎన్.టి.ఆర్ సరికొత్త లుక్ తో కనిపించనున్నారు మరియు శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఎన్.టి.ఆర్ సూపర్బ్ ఫైట్స్ చేస్తున్నాడని ఇదివరకే తెలిపాము. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.