యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కథని అందించారు.