‘రౌద్రం రణం రుధిరం’లో ఎన్టీఆర్ రెండు గెటప్స్ అవే !

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఒకటి ట్రైబ్ గెటప్ కాగా, రెండోది అప్పటి రోజుల్లోని విప్లవకారుడి గెటప్ ఆట. అలాగే ఎన్టీఆర్ సీన్స్ అన్ని గ్రాండ్ గా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని.. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కూడా చాలా గొప్పగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version