‘స్వామి రారా’ డైరెక్టర్ తో ఎన్.టి.ఆర్ సినిమా?

‘స్వామి రారా’ డైరెక్టర్ తో ఎన్.టి.ఆర్ సినిమా?

Published on Jun 13, 2013 1:20 PM IST

NTR-With-Varma

మొదటి సినిమా ‘స్వామి రారా’ తో మంచి పేరును సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుదీర్ వర్మ. తక్కువ బడ్జెట్ తో, స్టార్ హీరోస్ లేకుండా సినిమాను తీశారు. ఈ సినిమాకి ఆంద్ర ప్రదేశ్ అంతటా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సుదీర్ వర్మ తన తరువాత సినిమాని మంచి బ్రేక్ ఇచ్చే సినిమాగా ఒక పెద్ద హీరోతో చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. మాకందిన సమాచారం ప్రకారం సుదీర్ వర్మ ఎన్.టి.ఆర్ కోసం కథని సిద్దం చేశాడు. ఈ సినిమా కథని విన్న ఎన్. టి.ఆర్ చాలా ఇంప్రెస్ అయ్యి సినిమాకి ఒప్పుకున్నాడని సమాచారం. అలాగే ఎన్. టి.ఆర్ సుదీర్ తో మిగిలిన స్టోరీని కూడా సిద్దం చేయమని చెప్పాడని తెలిసింది. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు నిర్మించనున్నాడని సమాచారం. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

తాజా వార్తలు