ఈ రోజుతో డబ్బింగ్ పూర్తిచేయనున్న ఎన్.టి.ఆర్

Baadshah8
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమాకి డబ్బింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ డబ్బింగ్ ఈ రోజుతో ముగియనుంది. ఈ సినిమాకి సంబందించిన పనులు చివరి దశలో ఉన్నాయి, ఇంకా ఒకటి లేదా రెండు గంటల డబ్బింగ్ మాత్రమే మిగిలివుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మిగిలిన పోస్ట్ -ప్రొడక్షన్ పనులు కూడా ముగించనున్నారు. ఈ సినిమాకి మార్చి 29న సెన్సార్ జరుగనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటించింది. ఎన్.టి.ఆర్, మహేష్ బాబుల మద్య ఉన్న స్నేహంతో ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి గోపి మోహన్ – కోన వెంకట్ లు స్క్రిప్ట్ ను అందించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.

Exit mobile version