త్వరలో బాద్షాకి డబ్బింగ్ మొదలు పెట్టనున్న ఎన్.టి.ఆర్

త్వరలో బాద్షాకి డబ్బింగ్ మొదలు పెట్టనున్న ఎన్.టి.ఆర్

Published on Mar 8, 2013 8:17 AM IST

NTR-in-Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మార్చి 11 నుంచి ‘బాద్షా’ సినిమాకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టనున్నాడు. మామూలుగానే ఎన్.టి.ఆర్ చాలా ఫాస్ట్ గా డబ్బింగ్ చెబుతారని పేరుంది, కావున మొదలుపెట్టిన 2-3 రోజుల్లో ఎన్.టి.ఆర్ డబ్బింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తం షూటింగ్ ఈ నెల 16 కల్లా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని ఫోటోలలో ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో 17న జరగనుంది, అలాగే ఏప్రిల్ 5న సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత.

తాజా వార్తలు