బి మరియు సి సెంటర్స్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన తదుపరి చిత్రం ‘బాద్షా’ తో ఎ సెంటర్ ప్రేక్షకులను మరియు ఓవర్సీస్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎన్.టి.ఆర్ లుక్ చాలా మార్చాడు మరియు ఈ చిత్రంలో సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మరియు శ్రీను వైట్ల చిత్రాలకు ఎ సెంటర్ మరియు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాలన్నీ ఎన్.టి.ఆర్ కి అర్బన్ ఏరియాల్లో క్రేజ్ సంపాదించుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ‘బాద్షా’ చిత్రం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.