సుకుమార్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్

Sukumar-and-NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మాస్ పల్స్ తెలిసిన హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే సంతోష్ శ్రీనివాస్ చేయనున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. తాజాగా ఎన్.టి.ఆర్ మరో క్రీజీ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. సుకుమార్ చెప్పిన కథ ఎన్.టి.ఆర్ కి బాగా నచ్చడంతో వెంటనే సినిమాకి పచ్చ జెండా ఊపారు. చాలా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తారు.

సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబు ‘1- నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సుకుమార్ ఎన్.టి.ఆర్ సినిమాని మొదలు పెడతాడు.

Exit mobile version