మండువ లోగిలి సెట్లో ఎన్.టి.ఆర్

Ramayya-Vasthavayya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్ర యూనిట్ ఫిల్మ్ సిటీలోని ‘మండువ లోగిలి’ సెట్లో ప్రధాన తారాగణం పై షూటింగ్ చేస్తున్నారు. హై వోల్టేజ్ ఎంటర్టైనర్ సినిమాలు తీయడంలో మంచి పేరున్న హరీష్ శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్. ‘మండువ లోగిలి’ అనే సెట్ ఆంధ్ర ప్రదేశ్ లోని రూరల్ ఏరియాలను చూపించే విధంగా ఉంటుంది.

సమంత, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. ఆగష్టులో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ – సమంత – దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ‘బృందావనం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా ఆ సినిమాలానే సక్సెస్ అవుతుందని ఈ చిత్ర టీం ఆశిస్తున్నారు.

Exit mobile version