‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తరువాత్ సినిమల సెలెక్షన్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తరువాత తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన తరువాత సినిమాలను తారక్ ప్లాన్ చేసుకున్నాడు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసి.. కన్నడంలోని ప్రేక్షకులకు ఓన్ అయిపోవడం, డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేసి తమిళంలో కూడా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు.
ఇక ఆ తరువాత ఓ బాలీవుడ్ బడా దర్శకుడితో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట తారక్. ఏమైనా తారక్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉందని, పాన్ ఇండియా ఇమేజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ అలాగే ఆ ఇమేజ్ ని నిలబెట్టుకునే ఆలోచనలో అందరి హీరోల కంటే ఎన్టీఆరే ముందు వరుసలో ఉన్నాడు. పైగా ఎన్టీఆర్ చూజ్ చేసుకున్న డైరెక్టర్స్.. ఆల్ రెడీ వాళ్ళకంటూ ఓ మార్కెట్ ఉంది. అది కూడా ఎన్టీఆర్ సినిమాలకు ఉపయోగపడుతుంది. మొత్తానికి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.