ఎన్.టి.ఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ – హరీష్ శంకర్

Harish-shankar

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి అపరిమితమైన టాలెంట్ ఉందన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైలాగ్స్ పై ఆయనకు వున్న పట్టు, ఆయనకు గల అద్బుతమైన మెమరీ, ఎన్.టి.ఆర్ ఎప్పటికి డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేయడు. మాస్ ఎంటర్టైనింగ్ సినిమాలతో, పంచ్ డైలాగులతో అందరిని మెప్పించే డైరెక్టర్ హరీష్ శంకర్ ఎన్.టి.ఆర్ టాలెంట్ పై స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్.టి.ఆర్ తో షూటింగ్ సమయంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను హరీష్ శంకర్ ట్వీట్స్ చేయడం జరిగింది. “యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నిజంగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయన వల్ల షూటింగ్ లేటు అవుతుందన్న భయం ఉండదు. ఆయన మెమరీ నిజంగా నమ్మశక్యం కాదు”. అని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ వర్షం వల్ల కాస్త ఆలస్యం అవుతోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేయాలనుకుంటున్నాము. ఈ సినిమా ఆడియో ని ఆగష్టులో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version