‘కాంతార’ మూడో పార్ట్ లో ఎన్టీఆర్.. నిజమేనా ?

‘కాంతార’ మూడో పార్ట్ లో ఎన్టీఆర్.. నిజమేనా ?

Published on Aug 4, 2025 1:02 PM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఐతే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. కన్నడలో విజయవంతమైన ఫ్రాంచైజీ అయిన కాంతార మూడో పార్ట్ లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త పై ఇంకా అధికారిక అప్ డేట్ లేనప్పటికీ, కాంతరా దర్శకుడు రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. కాంతరా మూడో పార్ట్ ద్వారా ఎన్టీఆర్ కన్నడ సినిమాల్లోకి తన పరిధిని విస్తరించుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అన్నట్టు, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో కలిసి డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు