First Posted at 08:20 on Apr 17th
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్నిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా వేగంగా జరుగుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ రోజు ఓ పాటని షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ – సమంతల మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ ఎంటర్టైనింగ్ ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు. 2013 సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.