యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మలేషియాకి మారింది. అక్కడే ఈ సినిమా కొద్ది రోజులు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, శృతి హాసన్ ఓ కీలాక పాత్రలో కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాలో హరీష్ శంకర్ అదిరిపోయే పంచ్ డైలాగ్స్ రాసుంటాడని ఆశిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత