‘దమ్ము’ డబ్బింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్

‘దమ్ము’ డబ్బింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్

Published on Mar 21, 2012 10:48 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసాడు. ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో ఇంకా ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్లో శరవేగంగా ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీపడని బోయపాటి శ్రీను దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఇంటర్నెట్లో విడుదలైన ఎన్టీఆర్ స్టిల్స్ మరియు పోస్టర్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మార్చ్ 29 న అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు