సెప్టెంబర్ లో ఎన్.టి.ఆర్ – బెల్లంకొండ సినిమా సెకండ్ షెడ్యూల్

NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ‘కందీరిగ’ ఫేం శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా రాబోతుంది. ఈ సినిమాకి షూటింగ్ ఈ మద్యనే ప్రారంభమైంది. ఈ సినిమాకి సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెల్లాపూర్ ఏరియాలో చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభంకానుంది. పాపులర్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి శ్యాం కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ సబ్జెక్ తో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం.

Exit mobile version