“ఖిలాడి”గా సర్ప్రైజ్ చేసిన మాస్ మహారాజ్.!

“ఖిలాడి”గా సర్ప్రైజ్ చేసిన మాస్ మహారాజ్.!

Published on Oct 18, 2020 10:08 AM IST

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో “క్రాక్” అనే పవర్ ఫుల్ సబ్జెక్టు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూట్ ఇప్పుడు అంతిమ దశలో ఉంది. అయితే ఇది ఇంకా లైన్ లో ఉండగానే రవితేజ “రాక్షసుడు” హిట్ దర్శకుడు రవివర్మతో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ను ఓకే చేసారు. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఒక ప్రీ లుక్ పోస్టర్ తో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఈరోజు 11:55 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు.

కానీ మాస్ మహారాజ్ మాత్రం కాస్త ముందుగానే పలకరించారు. ఈ చిత్రానికి “ఖిలాడి” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టి అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ముందుగానే ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ పోస్టర్ లో కరెన్సీ నోట్లు చూస్తుంటే టైటిల్ కు తగ్గట్టుగానే ఒక స్మార్ట్ దొంగ రోల్ లో రవితేజ కనిపిస్తారనిపిస్తుంది. మరి మొత్తానికి మాత్రం మాస్ మహారాజ్ నుంచి మరో ఫీస్ట్ రావడానికి రెడీ అవుతుంది.

ఇందులో మరిన్ని ఆసక్తికర విషయాలు ఏమిటంటే ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారట. అలాగే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కోనేరు వంశీ ఏమాత్రం తగ్గకుండా బడ్జెట్ పెట్టనున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది.

తాజా వార్తలు