షూటింగ్స్ ఇక ఇప్పట్లో లేనట్లే !

కరోనా తీవ్రత ఇంకా భారత్‌ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరోపక్క టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో కలిసి చర్చించి జూన్ 15 నుంచే షూటింగ్ లు మొదలెట్టుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేత అనుమతి తీసుకున్నారు. కానీ ఏ పెద్ద సినిమా షూటింగ్ ను ఇంకా మొదలుపెట్టలేదు. తొందరపడిన ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా సెలైంట్ అయిపొయింది. కారణం లాక్ డౌన్ అనంతరం కరోనా కేసులతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.

మొత్తానికి ఇప్పట్లో షూటింగ్ లు వుండేలా కనిపించడం లేదు. విడుదలకు సిద్దంగా వున్న సినిమా ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు అనుకున్నా ఆ పరిస్థితి కూడా కష్టంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. షూటింగ్ లు ఇప్పటికిప్పుడు ప్రారంభమైతే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను షూటింగ్ స్పాట్లో తప్పనిసరిగా పాటిస్తూ షూట్ చేయడం అంటే సాధ్యం కాదు.

Exit mobile version