ఇక సూర్య సినిమాపైనే అన్ని అంచనాలూ.!

ఈ ఏడాది ఊహించని విధంగా పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోయాయి. లాక్ డౌన్ మూలాన ఎన్నో సినిమాలు నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే విడుదల అవుతూ వస్తున్నాయి. దాదాపు అన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలలో కూడా అన్ని భాషల సినిమాలు వస్తున్నాయి. కానీ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం కాస్త పెద్ద బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి.

కానీ అలా ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు ముందే మంచి హైప్ ను తెచ్చుకున్న చిత్రాలు తీరా విడుదలయ్యాక మాత్రం ఎలాంటి ఫలితాన్ని దక్కించుకున్నాయో తెలిసిందే. దీనితో ఒకింత మూవీ లవర్స్ నిరాశలో ఉన్నారు. ఇక ఈ చిత్రం తర్వాత మన దగ్గర గ్రాండ్ రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా ఏదన్న ఉంది అంటే అది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆకాశమే నీ హద్దురా” అని చెప్పాలి.

ఈ సినిమా హాక్కులను కూడా భారీ మొత్తంలోనే అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేసారు దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ సినిమా అయినా సరే మంచి హిట్ అవ్వాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో అస్లు పెట్టుకున్న సినిమాలు అన్నీ నిరాశ పరిచాయి. మరి ఈ చిత్రం అయినా సరే హిట్ అవ్వాలని అటు తెలుగు మరియు మన తెలుగు ఆడియెన్స్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే అక్టోబర్ 30 వరకు ఆగాల్సిందే.

Exit mobile version