బాలీవుడ్లో అంత గొప్పేమీ లేదు : అనుష్క


యోగా బ్యూటీ అనుష్క తన అందం మరియు అభినయంతో కొన్ని కోట్ల మంది తెలుగు సినీ అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె తెలుగులో టాప్ హీరోలందరితోనూ నటించి ఎన్నో విజయాలను అందుకున్నారు. మన హీరోయిన్స్ అంతా సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ రాగానే బాలీవుడ్ బాట పడుతున్నారు. కానీ అనుష్క మాత్రం ఆ ట్రెండ్ కి దూరంగా ఉంది. హీరోయిన్స్ సక్సెస్ ని బాలీవుడ్ నిర్ణయించదు అని అనుష్క అంటున్నారు. ‘ చాలా మంది హీరోయిన్స్ సౌత్ ఇండియాలో కొన్ని హిట్ సినిమాల్లో నటించి తర్వాత తమ సత్తా చాటుకోవడానికి బాలీవుడ్ కి వెళ్తున్నారు. అందులో తప్పేమీ లేదు కానీ బాలీవుడ్లో నటించడమే తమ లక్ష్యంగా పెట్టుకోవడం తప్పని ‘ అనుష్క అన్నారు.

అలాగే మాట్లాడుతూ ‘ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమి తక్కువ కాదు, ఇక్కడ కూడా మంచి సినిమాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ కి వెళ్తున్నాయి అలాగే తెలుగు మరియు తమిళంలో కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వస్తున్నాయి. ‘అరుంధతి’ సినిమా బాలీవుడ్ కి విపరీతంగా నచ్చేసింది మరియు మన డైరెక్టర్స్ తీర్చిదిద్దే హీరోయిన్ పాత్రలు బాలీవుడ్ తో పోల్చుకుంటే ఏ మాత్రం తక్కువ కాదు.సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు బాలీవుడ్ కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదని’ ఆమె అన్నారు.

ప్రస్తుతం అనుష్క నాగార్జున సరసన నటించిన ‘డమరుకం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది, ఇది కాకుండా ప్రభాస్ సరసన ‘వారధి’ సినిమాలో నటిస్తోంది. అనుష్క ఇలా మాట్లాడటం మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో గర్వించ దగ్గ విషయం మరియు ఇది విన్న తరవాత మీడియా మరియు అభిమానులు ఎంతో సంతోషిస్తారు.

Exit mobile version