మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు మరో విషాదం నెలకొంది. ఈ మధ్య కాలంలో కరోనా తో అనేక మంది సినీ ప్రముఖులు ప్రమాదాల బారిన పడ్డారు అంతే కాకుండా ఎందరో లెజెండరీ నటులు కూడా ఈ ఏడాదే కన్ను మూసారు. ఇప్పుడు అలా మరో ప్రముఖ టెక్నిషియన్ ఎడిటర్ కోలా భాస్కర్ కన్ను మూశారన్న వార్త విషాదాన్ని నెలకొల్పింది.
తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలకు ఎడిటింగ్ వర్క్ అందించిన ఈయన గత కొన్ని వారాల కితం హైదరాబాద్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో అడ్మిట్ అయ్యారు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు తన 55వ ఏట క్యాన్సర్ తో పోరాడి తుది శ్వాస విడిచారు.
కోలా భాస్కర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ “ఖుషి” సెల్వ రాఘవన్ ఐకానిక్ చిత్రాలు “7/జి బృందావన కాలనీ”, “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” సినిమాలకు ఎడిటర్ గా పని చేసారు. ఆయన అకాల మరణం పట్ల మా 123తెలుగు టీం ప్రఘాడ సంతాపాన్ని తెలియజేస్తుంది.