మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర ఆలాగే మరో దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. అయితే ఈ సినిమాల్లో విశ్వంభర ఎప్పుడో మొదలైంది కానీ దీని నుంచి కేవలం రెండు టీజర్ లు, పోస్టర్ లు మాత్రమే బయటకి వచ్చాయి.
కానీ ఇంకో పక్క అనీల్ రావిపూడి సినిమా మాత్రం జెట్ స్పీడ్ లో వరుస అప్డేట్స్ తో దూకుడు చూపిస్తున్నారు. ఇలానే ఇపుడు విశ్వంభర కంటే ముందే మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ వచ్చేలా ఉందట. ఈ దసరా కానుకగా ఈ ఎంటర్టైనర్ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని వదిలే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.