ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ బాగా బిజీ బిజీగా ఉంటోంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఆమె నటించిన మూడు సినిమాలు రిలీజ్ కాగా, మరో సినిమా ‘ఎవడు’ డిసెంబర్లో రిలీజ్ కానుంది.
ఈ రోజు శృతి ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సినిమా అనేది ఒక ఆప్షన్ కాదని, సినిమానే జీవితం అనుకోని పెరిగానని చెప్పింది. అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘ నా కెరీర్ మొదట్లో అపజయాలు వచ్చాయి, కానీ నేను వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి సినిమాలు చేయడానికి వచ్చాను. కేవలం సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించడానికి మాత్రమే రాలేదు. కానీ ఓ హీరోయిన్ కి హిట్ అవసరం. అలా అని ఫ్లాప్ అయితే నిరాశపడిపోకూడదు. విజయాలకు గర్వపడి, అపజయాలకు డీలా పడితే ఇండస్ట్రీలో ముందుకెళ్ళలేమని’ శృతి చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘రేస్ గుర్రం’ సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో ‘వెల్ కమ్ బ్యాక్’ సినిమాలో నటిస్తోంది.