నార్త్, నేపాల్ లో ‘కాంతార 1’ రిలీజ్ చేసేది వీరే!

Kanthara

కన్నడ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. దీనికి ముందు వచ్చిన చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ అక్టోబర్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ డీల్ పై మేకర్స్ ఇపుడు క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని నార్త్ లో ఏఏ ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. వీరు కేవలం హిందీ లోనే కాకుండా నేపాల్ లో కూడా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. సో కాంతార గ్రాండ్ రిలీజ్ వీరిచే కానుంది. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 2న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version