అవును ఆ సినిమాలో పాటలు లేవు


విలక్షణ దర్శకుడు రవిబాబు మరో సినిమాతో ఈ వారం మన ముందుకు రాబోతున్నాడు. అవును అనే సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవిబాబు ఈ సినిమాలో రెగ్యులర్ అంశాలు లేకుండా వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసారు దర్శకుడు. ఈ సినిమాలో పాటలేమి లేకుండా కేవలం ఒక్క పోస్టర్ తో మాత్రమే ప్రమోషన్ చేస్తున్నారు. పూర్ణ, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. రవిబాబు పోలీసు ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాని రవి బాబు, పివిపి సినిమాస్ వారు కల్సి సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version