డార్లింగ్ బర్త్ డే ట్రీట్ లేదంటున్న ‘రాజాసాబ్’

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే, ప్రభాస్ పుట్టినరోజు సమీపిస్తుండటంతో ఈ సినిమా నుంచి ఎలాంటి సాలిడ్ ట్రీట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది.

అయితే, ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సాంగ్ రిలీజ్ చేయడం లేదని రాజాసాబ్ మేకర్స్ వెల్లడించారు. కాగా, ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version