గత కొద్ది రోజులుగా వాతావరణం ఎంత కూల్ గా ఉన్నా అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త మాత్రం రోజు రోజుకీ హాట్ హాట్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రానున్నాడా? లేదా? అసలు కొత్త పార్టీ పెడుతున్నాడా? లేక ఇప్పటికే ఉన్న ఏదన్న పార్టీలో చేరతాడా? అనే విషయాలపై మార్చి రెండవవారంలో ఒక క్లియరెన్స్ వస్తుదని ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రజలకు ఒక పిడుగు లాంటి వార్త.
తాజాగా మీడియా వారందరికీ ‘ప్రస్తుతానికైతే తన రాజేకీయ ప్రవేశం గురించి తెలపడం కోసం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోవడం లేదని’ పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. దాంతో మరో వారంలో సస్పెన్స్ వీడిపోతుంది అనుకుంటున్న ఈ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అభిమానుల మదిలో ఉన్న ప్రశ్నలకు జవాబు దొరక్కుండా పోయింది. ముందు ముందు ఏమన్నా ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.