“నేను చొక్కా విప్పే సమస్యేలేదు”: మహేష్ బాబు

“నేను చొక్కా విప్పే సమస్యేలేదు”: మహేష్ బాబు

Published on Dec 28, 2013 1:10 PM IST

mahesh_babu
మహేష్ బాబు ఫీట్ నెస్ ట్రైనర్ ను పెట్టుకున్నాడు అన్న వార్త రాగానే అతను తన తదుపరి సినిమా ‘1-నేనొక్కడినే’ లో తన సిక్స్ ప్యాక్ ను చూపిస్తాడని పుకార్లు వినిపించాయి. అయితే ఈ ఆరదుగుల అందగాడు ఒక ఇంటర్వ్యూలో తనకు చొక్కా విప్పి బాడీని చూపించే ఆలోచనలేదని స్పష్టం చేసాడు

“‘1’ సినిమా షూటింగ్ కాస్త కష్టతరంగా సాగింది. ఇందులో నేను కొత్త గెట్ అప్ లో కనబడాలి. అందుకే నేను ట్రైనర్ ని పెట్టుకుని శ్రమపడాల్సివచ్చింది. అంతకు మించి మరే కారణం లేదని”తెలిపాడు. ఈ సినిమాలో బిల్డింగ్ ల మీదనుండి జంప్ లు, లెక్కలేనన్ని ఫైట్ సీన్ లు వున్నందువల్ల మహేష్ ఫీట్ గా వుండడంకోసం ఈ పద్ధతిని అనుసరించాడు. సుకుమార్ దర్శకుడు. కృతి సనన్ హీరోయిన్. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే గౌతం స్క్రీన్ పై తొలిసారిగా కనిపించనున్నాడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. జనవరి 10న ఈ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు