గుండెల్లో గోదారిలో లిప్ లాక్ సీన్స్ లేవు.!

Gundello-Godari
మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ మంచు నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఆది, తాప్సీ, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఆది – తాప్సీ మధ్య లిప్ కిస్ సీన్స్ ఉన్నాయనే వార్తలు కొద్ది రోజుల నుంచి విహరిస్తున్నాయి. ఈ సీన్ ని షూట్ చేసారని కానీ సెన్సార్ వారు సినిమాలో కట్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి తాప్సీని ప్రశ్నిస్తే ‘ ఈ సినిమాలో ఎలాంటి లిప్ లాక్ సీన్స్ లేవని, అసలు ఇప్పటి వరకూ నా కెరీర్లో లిప్ లాక్ సీన్స్ చేయలేదని’ తెలిపింది. కుమార్ నాగేందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది.

Exit mobile version