పూరి జగన్నాథ్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందని మనకు తెలుసు, పూరి సినిమాలోని కొన్ని ఐటమ్ సాంగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. కానీ పూరి ఈ పద్దతిని తన రాబోవు ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో బ్రేక్ చేయనున్నాడు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ వుండదు. ఈ సినిమా స్టోరీ ప్రకారం ఐటమ్ సాంగ్ పెడితే బాగోదని ప్రొడక్షన్ టీం ఐటమ్ సాంగ్ పెట్టే ఉద్దేశాన్ని మానుకున్నారని తెలిసింది.
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రొమాంటిక్ అవతారంలో కనిపించనున్నాడు. కేథరిన్, అమలా పాల్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణం దాదాపుగా పూర్తైంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.