‘అఖండ 2’ రిలీజ్ తగ్గేది లేదు.. యుద్ధం అనివార్యం

akhanda 2

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య నుంచి ఇదే ఏడాదిలో రెండో సినిమాగా అనౌన్స్ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. అయితే సినిమా అనుకున్న టైం కి వస్తుందా లేదా అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ చిత్రం ‘ఓజి’ కూడా ఉండడంతో పోటీ విషయంలో ఎప్పుడు నుంచో భారీ హైప్ సెట్ అయ్యింది.

అయితే ఈ సినిమాల్లో అఖండ 2 కొంచెం అటు ఇటు కావచ్చని టాక్ వచ్చింది. సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా పనులు ఆలస్యం కావచ్చని టాక్ వచ్చింది. కానీ ఇపుడు మళ్ళీ అఖండ 2 సెప్టెంబర్ 25నే రావడం గ్యారెంటీ అని మేకర్స్ చెబుతున్నారు. రీసెంట్ ఇంటరాక్షన్ లో బోయపాటి సెప్టెంబర్ 25నే అఖండ ఆగమనం అని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఓజి వర్సెస్ అఖండ 2 యుద్ధం అనివార్యమే అని చెప్పక తప్పదు.

Exit mobile version