ఇక ప్రభాస్ ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లేనట్టేనా.?

ఇక ప్రభాస్ ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లేనట్టేనా.?

Published on Nov 10, 2020 7:05 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా మొత్తం ఇండియన్ సినిమానే ఏలే వాడయ్యాడు. అందుకే మన దేశంలో బడా నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు అలాగే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ముందుకొస్తుంన్నారు. అలా ఇప్పటికే రెండు చిత్రాలు లైన్ లో పెట్టిన డార్లింగ్ ఇంకా సెన్సేషనల్ ప్రాజెక్టులను చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే ఇవి ఇలా ఉంటే ప్రభాస్ ఓ సాలిడ్ సినిమా చేయనున్నాడని ఆ మధ్య అంతా విపరీతమైన టాక్ వచ్చింది. అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో. కేజీయఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ తో సినిమా అంటే ఆ అంచనాలు పీక్స్ లోకి వెళ్లాయి. కానీ ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై మాత్రం ఎలాంటి సమాచారమూ రాలేదు. దీనితో ఇపుడు ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ప్రభాస్ ఎలాగో “రాధే శ్యామ్” తర్వాత “ఆదిపురుష్” కోసం ప్రిపేర్ అవ్వనున్నారు. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఉందో లేదో అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు