వరుస అపజయాల తరువాత తనకు హిట్ హిచ్చిన నిత్య మీనన్ తో కలిసి నితిన్ మరో సినిమా చేయబోతున్నాడు. సై చిత్రం తరువాత ఆ స్థాయి విజయం లేని నితిన్ కి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇష్క్’ చిత్రం అతనికి తిరిగి ఊపిరి పోసింది. ఇష్క్ సినిమాని నిర్మించిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ వారే నితిన్, నిత్య కాంబినేషన్లో మరో సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి విజయ్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. విజయ్ కుమార్ గతంలో ఫ్రెండ్ షిప్ అనే ఒక చిన్న సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ నెల 19 పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.